Home /News /politics /

REBEL MLAS MOVED FROM MUMBAI TO GOAALL EYES ON THE SPEAKER ON TUESDAY MS

కర్'నాటకం' : రాజీనామాలపై నేడే స్పీకర్ నిర్ణయం..? ఏం జరగబోతోంది..

రిసార్టుకు జేడీఎస్ ఎమ్మెల్యేలు (PTI)

రిసార్టుకు జేడీఎస్ ఎమ్మెల్యేలు (PTI)

ఇప్పటివరకు మొత్తం 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్‌ను వీడారు. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి నగేశ్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఇంకా చదవండి ...
    కర్ణాటక రాజకీయ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందోనన్నది అంతుచిక్కడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో కొనసాగేందుకు వారికి మంత్రి పదవులు ఆఫర్ చేయాలని సీఎం కుమారస్వామి భావిస్తున్నారు. ఇందుకోసం 32మంది కేబినెట్ మంత్రులతో రాజీనామా కూడా చేయించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు ఆశపడి ప్రభుత్వంలో కొనసాగేందుకు ఒప్పుకుంటారా? లేక బీజేపీ వైపే మొగ్గుచూపుతారా? అన్నది తేలాల్సి ఉంది.

    ఇప్పటివరకు మొత్తం 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్‌ను వీడారు. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి నగేశ్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మంగళవారం ఆయన స్పీకర్ కార్యాలయానికి రానున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను పిలిపించి వారితో విడివిడిగా మాట్లాడనున్నారు. అనంతరం వారి రాజీనామా ఆమోదంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రాజీనామాలకు స్పీకర్ ఆమోద ముద్ర పడితే.. కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోయినట్టే. కాబట్టి రాజకీయ వర్గాలందరిలోనూ స్పీకర్ నిర్ణయం పైనే ఉత్కంఠ నెలకొంది.

    ఇదిలా ఉంటే, కాంగ్రెస్,జేడీఎస్‌లకు రాజీనామా చేసి ముంబై వెళ్లిన 14మంది ఎమ్మెల్యేలను.. బీజేపీ గోవా తరలిస్తున్నట్టు చెబుతున్నారు. గోవాలోని ఓ హోటల్లో వీరందరిని ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.ముంబై బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు మోహిత్ భారతీయ నేత్రుత్వంలో ఇదంతా జరగనుంది. బీజేపీలో చేరుతామని వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి మనసు మార్చుకుని వెనక్కి వెళ్లకుండా ఆ పార్టీ జాగ్రత్తపడుతోంది. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సోమవారం రాత్రి ఆ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ హోటల్ నుంచి నగర శివారులోని ఓ రిసార్టుకు తరలించారు.మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్‌ల నడుమ నడుస్తున్న ఈ రాజకీయ పోరులో అంతిమ విజయం ఎవరిదన్నది త్వరలోనే తేలిపోనుంది.
    First published:

    Tags: Congress, Hd kumaraswamy, Jds, Karnataka bjp, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు