YS Sharmila పార్టీకి అదే మైనస్‌గా మారిందా ?.. పాదయాత్ర చేస్తున్నప్పటికీ..!

పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల

YS Sharmila: సాధారణంగా తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. వాటికి ప్రత్యర్థుల నుంచి కౌంటర్ రావడం జరుగుతుంటుంది.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకోసం ఏడాదిపాటు సుదీర్ఘంగా పాదయాత్ర చేయడానికి సైతం సిద్ధపడ్డారు. వారం క్రితం మొదలైన వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా అధికార టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ షర్మిల.. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ నుంచి తెలంగాణలో షర్మిల పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదనే టాక్ ఉంది. ఆమె పార్టీలో పేరున్న పెద్ద నాయకుడు ఎవరూ చేరకపోవడం కూడా ఇందుకు ఒక ప్రధాన కారణం. అయితే తన వెంట నాయకులెవరూ కలిసొచ్చినా.. రాకపోయినా... కార్యకర్తలనే నాయకులుగా మార్చుతానని షర్మిల చెబుతున్నారు.

    అయితే అసలు తెలంగాణలో షర్మిల పార్టీ గురించి ప్రజల్లో పెద్దగా చర్చ జరగకపోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లిన షర్మిల.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆ పార్టీలు, ఆ పార్టీలకు చెందిన ముఖ్యనేతలెవరూ షర్మిల కామెంట్స్‌ను, ఆమె రాజకీయ పార్టీని సీరియస్‌గా తీసుకోవడం లేదు.

    కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి ప్రధాన పార్టీల నేతలు ఒకటి, రెండు సార్లు మాత్రమే షర్మిల పార్టీ గురించి మాట్లాడారు. ఆ తరువాత వాళ్లెవరూ షర్మిల పార్టీ గురించి, ఆమె తమ పార్టీలపై చేస్తున్న విమర్శల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిపై స్పందించడం లేదు. షర్మిల, ఆమె రాజకీయ పార్టీ గురించి పెద్దగా చర్చ జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    సాధారణంగా తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. వాటికి ప్రత్యర్థుల నుంచి కౌంటర్ రావడం జరుగుతుంటుంది. ఇలా వారి గురించి రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కానీ షర్మిల విషయంలో మాత్రం అలా జరగకపోవడం వల్లే.. ఆమె పార్టీ గురించి ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదని.. ఇదే ఆమెకు, ఆ పార్టీకి మైనస్‌గా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే షర్మిల పార్టీ కారణంగా తమకు ముప్పు ఉందని భావిస్తే.. మిగతా పార్టీల నేతలు ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తారని.. ప్రస్తుతానికి ఆమె పార్టీ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకోవడం వల్లే.. ఆమెను లైట్ తీసుకుంటున్నారేమో అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: