Home /News /politics /

REASON BEHIND WHY PAWAN KALYAN AND JANASENA SILENT ON TDP PRESIDENT CHANDRABABU NAIDU ALLIANCE COMMENTS AK

Chandrababu-Pawan Kalyan: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సైలెంట్.. అసలు కారణం అదేనా ?

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలపై అసంతృప్తి కారణంగానే జనసేన ఆ పార్టీ నుంచి వచ్చిన పొత్తు ఆఫర్‌పై స్పందించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

    జనసేనతో పొత్తు పెట్టుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. రాజకీయాల్లో వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం ఉండదని.. పరోక్షంగా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉంటేనే తాము ఆ పార్టీతో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఆ తరువాత రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పేమీ కాదని.. తాము మరోసారి పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన తరువాత.. జనసేన నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు మాటంటే టీడీపీ మాట. ఆయనే స్వయంగా ఆ మాట చెప్పడంతో.. ఇక జనసేన నుంచి స్పందన కచ్చితంగా వస్తుందని అంతా ఊహించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో దీనిపై స్పందించలేదు. ఇందుకు కారణంగా ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    నిజానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలని జనసేన భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో స్నేహబంధం కొనసాగిస్తున్నప్పటికీ.. ఎన్నికలనాటికి జనసేన.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. కానీ జనసేన మాత్రం ఈ విషయంలో సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. చివరకు చంద్రబాబు పొత్తులపై వ్యాఖ్యలు చేసినా.. జనసేన నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదు.

    అయితే చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలపై అసంతృప్తి కారణంగానే జనసేన ఆ పార్టీ నుంచి వచ్చిన పొత్తు ఆఫర్‌పై స్పందించడం లేదనే టాక్ వినిపిస్తోంది. తాను వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తానని.. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వీలైతే కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జనసేన భావిస్తోంది. కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ తానే ముఖ్యమంత్రి అనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉండటం జనసేన నాయకులకు రుచించడం లేదని సమాచారం.

    Telangana: KCRకు బీజేపీ గట్టి షాక్.. ఈ రేంజ్ రియాక్షన్ ఊహించలేదా ?

    Telangana: జెట్ స్పీడ్‌గా బీజేపీ.. కన్నెత్తి చూడని కాంగ్రెస్.. తెలంగాణలో భిన్న పరిస్థితి

    ఒకవేళ తమకు మంచి సంఖ్యలో సీట్లు వచ్చి.. ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటే అప్పుడు టీడీపీకి ప్రభుత్వ పగ్గాలు ఎలా ఇస్తామనే భావనలో కొందరు జనసేన నేతలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమ పొత్తుల వల్ల ఇతర పార్టీలకే లాభం కలుగుతుందని.. అలా కాకుండా సొంతంగానే తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారని.. అందుకే పొత్తుల గురించి టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ గురించి పట్టించుకోవడం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Pawan kalyan

    తదుపరి వార్తలు