కాంగ్రెస్‌పై విజయశాంతి అసంతృప్తికి కారణం అదేనా ?

కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు తనను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విజయశాంతి భావిస్తున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: August 16, 2019, 5:20 PM IST
కాంగ్రెస్‌పై విజయశాంతి అసంతృప్తికి కారణం అదేనా ?
విజయశాంతి ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
సినీనటి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి సొంత పార్టీపై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉండటానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు తనను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదనే భావనలో విజయశాంతి ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు బీజేపీ నేతలు విజయశాంతిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారని... ఇందుకు ఆమె కుడా సానుకూలంగా స్పందించారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తనకు పార్టీలో ఏ రకమైన ప్రాధాన్యత ఉంటుందనే దానిపై బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తరువాతే ఆ పార్టీలోకి వెళ్లాలని విజయశాంతి భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీ వల్లే అవుతుందని యోచనలో ఉన్న విజయశాంతి... పార్టీ మార్పు అంశంపై సన్నిహితులు, అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు