Home /News /politics /

తహసీల్దార్ హత్య కేసు... లంచం అడిగినందుకే చంపేశాడా ?

తహసీల్దార్ హత్య కేసు... లంచం అడిగినందుకే చంపేశాడా ?

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో సజీవ దహనానికి గురైన విజయారెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు.

    రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. తహశీల్దార్‌ను సజీవ దహనం చేసిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. నిందితుడిని రైతు సురేష్ గా పోలీసులు గుర్తించారు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయ తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని నిందితుడు సురేష్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ చెప్పినట్టు తెలుస్తోంది.

    రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినవానికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడ మృతిచెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు.దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ... తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు.
    First published:

    Tags: Crime news, Hyderabad, MRO, Tahasildar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు