పోసాని మాటలకు అర్థమేంటి ?... వైసీపీలో ఆసక్తికర చర్చ

ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ,పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటోస్)

వైసీపీ అధికారంలోకి వస్తే... తనకు కీలకమైన నామినేటెడ్ పోస్ట్ వస్తుందని పోసాని ఆశించారని... అలా జరగకపోవడంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా సాగుతోంది.

  • Share this:
    సినీ ఇండస్ట్రీలో వైసీపీకి బలంగా మద్దతిచ్చిన నటుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. అలాంటి పోసాని కృష్ణమురళి... ఉన్నట్టుండి నటుడు, వైసీపీ నాయకుడు పృథ్వీరాజ్‌పై విమర్శలు గుప్పించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి రైతులు, మహిళలపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పోసాని... వెంటనే అతడు అమరావతి మహిళలు, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పోసాని మాటలకు అర్థమేంటనే దానిపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తనకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవి వద్దని పోసాని పదే పదే చెబుతున్నా... ఆయన తనకు ఎలాంటి పదవి రాలేదనే ఆవేదనలో ఉన్నారేమో అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    వైసీపీ అధికారంలోకి వస్తే... తనకు కీలకమైన నామినేటెడ్ పోస్ట్ వస్తుందని పోసాని ఆశించారని... అలా జరగకపోవడంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు పోసాని వ్యాఖ్యలతో ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని అనుకోలేమనే టాక్ కూడా ఉంది. పోసాని స్వస్థలం రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండటం వల్లే ఆయన పృథ్వీ వ్యాఖ్యలపై అంత ఘాటుగా రియాక్ట్ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ కమ్మవారికి వ్యతిరేకం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికే పోసాని ఈ రకమైన కామెంట్స్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి పోసాని మాటలకు అర్థమేంటో తెలియాలంటే... మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published: