పగతో గడ్డం పెంచుతున్న మాజీమంత్రి

తాను ఎందుకు గడ్డం పెంచుతున్నాననే దానిపై కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: December 4, 2019, 4:53 PM IST
పగతో గడ్డం పెంచుతున్న మాజీమంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీమంత్రి డీకే శివ కుమార్... రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా గడిపారు. కర్ణాటక కాంగ్రెస్‌లో మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న డీకే శివకుమార్... ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన లుక్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే డీకే శివకుమార్... ఈ మధ్యకాలంలో గడ్డం పెంచుతున్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం అంతా అవాక్కయ్యేలా చేసింది.

Karnataka, dk sivakumar, congress, jds, bjp, కర్ణాటక, డీకే శివకుమార్, కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ
కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమార్


జనం మీ మీద సానుభూతి చూపించేందుకే ఇలా గడ్డం పెంచుతున్నారా ? అని కొందరు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన డీకే శివకుమార్... ఈ గడ్డం పెంచడం వెనుక పగ కూడా ఉందని పరోక్షంగా తెలిపారు. తనను జైలుకు పంపించిన వాళ్లు ఎప్పుడూ తనకు గుర్తుండాలనే ఉద్దేశ్యంతోనే ఈ రకంగా గడ్డం పెంచుతున్నానని వివరించారు.First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>