ఉన్నట్టుండి టీడీపీ నేతలకు టార్గెట్‌గా మారిన Jr NTR.. అసలు కారణం ఇదేనా ?

జూనియర్ ఎన్టీఆర్

TDP: జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు సరైనవే అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమర్ధించారు.

 • Share this:
  రాజకీయాల్లో జరిగే పరిణామాలు, నేతలు చేసే వ్యాఖ్యలు వెనుక అనే కారణాలు, వ్యూహాలు ఉంటాయి. తాజాగా కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన కుటుంబాన్ని, భార్యను అవమానించారంటూ చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీరును నందమూరి కుటుంబసభ్యులు పలువురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఇక విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఘటనను ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి.

  అయితే ఉన్నట్టుండి ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరును పలువురు టీడీపీ నేతలు ప్రశ్నించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు. హరి కృష్ణ బతికే ఉంటే.. ఇంకో రకంగా ఉండేది అన్నారు.

  మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియోలో జూనియర్ స్పందన వింటే.. ప్రవచనాలు చెప్పినట్లు ఉందన్నారు. ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు సరైనవే అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమర్ధించారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని విమర్శలు.. నిజంగానే ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రవచనాలు చెప్పినట్లు, సుభాషితలు పలికారని మండిపడ్డారు.

  Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

  Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

  కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

  Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

  టీడీపీ నేతలు ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు చంద్రబాబు, నారా లోకేశ్‌కు సన్నిహితులు. దీంతో టీడీపీ నాయకత్వమే జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ రకంగా టార్గెట్ చేసిందా ? అనే టాక్ మొదలైంది. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడిందని.. పార్టీ పగ్గాలను చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి.

  అయితే ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని ప్రకటించారు. జిల్లాల పర్యటనల్లోనూ అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి తానే సారథ్యం వహించి గెలిపిస్తానని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకత్వం జూనియర్ ఎన్టీఆర్‌ను ఇరుకునపెట్టేందుకు అసెంబ్లీ ఎపిసోడ్‌ను ఉపయోగించుకుంటోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉన్నట్టుండి టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేశారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
  Published by:Kishore Akkaladevi
  First published: