గజ్వేల్ బరిలో గద్దర్...కాంగ్రెస్ నిర్ణయమే కారణమా ?

ప్రజా గాయకుడు గద్దర్ గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి పరోక్షంగా కాంగ్రెస్సే కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 8, 2018, 7:08 PM IST
గజ్వేల్ బరిలో గద్దర్...కాంగ్రెస్ నిర్ణయమే కారణమా ?
ప్రజా గాయకుడు గద్దర్(File)
news18-telugu
Updated: November 8, 2018, 7:08 PM IST
కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాల మద్దతు ఉంటే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు ప్రజా గాయకుడు గద్దర్. అయితే ఆ తరువాత ఈ అంశంపై ఆయన అంతగా స్పందించలేదు. అయితే గురువారం ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చిన గద్దర్ తాను గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం రాజకీయవర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత హఠాత్తుగా ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై చర్చ కూడా మొదలైంది.

అయితే గద్దర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీనే పరోక్షంగా కారణమనే ఊహాగానాల బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తన కుమారుడు సూర్యకిరణ్‌కు కేటాయిస్తారని భావించిన బెల్లంపల్లి సీటును పొత్తుల్లో భాగంగా సీపీఐకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కారణంగానే గద్దర్ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

చాలాకాలం క్రితమే గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మొదట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే అక్కడ తనకు సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో... బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, మహాకూటమిలో భాగమైన సీపీఐకు కేటాయించే సీట్ల జాబితాలో బెల్లంపల్లిని చేర్చింది కాంగ్రెస్. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం సూర్యకిరణ్‌కు లభించే దారులు దాదాపుగా మూసుకుపోయాయి.

కాంగ్రెస్ పార్టీ తరపున తన కుమారుడికి కచ్చితంగా సీటు వస్తుందని ఆశించిన గద్దర్... ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ కారణంగానే ఆయన గజ్వేల్‌ నుంచి కాంగ్రెస్ మద్దతు లేకపోయినా స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనా... గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన గద్దర్... నిజంగానే బరిలో ఉంటారా లేక తరువాత సైలెంట్ అయిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది.


First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...