హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad: తెలంగాణలో ‘హుజూరాబాద్’ హీట్ తగ్గిపోయిందా ?.. అసలు కారణం అదేనా ?

Huzurabad: తెలంగాణలో ‘హుజూరాబాద్’ హీట్ తగ్గిపోయిందా ?.. అసలు కారణం అదేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad By Election: కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం చెప్పిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో సీన్ మారిపోయింది. హుజూరాబాద్ ఎన్నికల హీట్ తగ్గిపోయింది.

మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఆయన బీజేపీలో చేరి మళ్లీ పోటీకి సిద్ధపడటంతో.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించుకోవడంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అంతకంటే ముందే హుజూరాబాద్‌లో ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచించింది. అక్కడ ప్రజలను టీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు దళితబంధు వంటి పథకం పైలెట్ ప్రాజెక్ట్ కోసం హుజూరాబాద్‌ను ఎంపిక చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా హుజూరాబాద్ సెంటర్‌గానే కామెంట్స్ చేయడం.. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయడంతో తెలంగాణ రాజకీయమంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరిగింది. సెప్టెంబర్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవుతుందని.. ఈ నెలలోనే ఈ ఉప ఎన్నిక పూర్తవుతుందని అంతా అనుకున్నారు.

కానీ కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టే అని తేల్చిచెప్పింది. వీలైతే నవంబర్ లేదా వచ్చే ఏడాది ఈ ఉప ఎన్నిక ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం చెప్పిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో సీన్ మారిపోయింది. హుజూరాబాద్ ఎన్నికల హీట్ తగ్గిపోయింది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు విపక్ష బీజేపీ హుజూరాబాద్‌పై ఫోకస్ తగ్గించడం మొదలుపెట్టాయి. అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించింది.

దీంతో హరీశ్ రావు హుజూరాబాద్‌పై ఫోకస్ పెంచారు. మరోవైపు మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు హుజూరాబాద్‌పై దృష్టి తగ్గించారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం ఈ ప్రచారాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు పరిమితమయ్యేలా చేశారు. బీజేపీ శ్రేణులంతా తమ ఫోకస్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్రపై పెట్టారు. అయితే ఈ రెండు పార్టీల నేతలు ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు.

Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

ఉప ఎన్నిక ఎప్పుడో తెలియకుండా హడావిడి చేయడం సరికాదని.. దీని వల్ల పార్టీకి పెద్దగా లాభం ఉండదని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ భావిస్తున్నాయి. అందుకే మళ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత హుజూరాబాద్‌లో పొలిటికల్ హీట్ పెంచాలని నిర్ణయించుకున్నాయి. మొత్తానికి తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి హఠాత్తుగా తగ్గిపోవడం వెనుక రాజకీయ పార్టీల వ్యూహం ఉందని అర్థమవుతోంది.

First published:

Tags: Bjp, CM KCR, Etela rajender, Harish Rao, Huzurabad By-election 2021, Telangana, Trs

ఉత్తమ కథలు