Home /News /politics /

REASON BEHIND CM KCR COMMENTS ON LOCAL BODY MLC ELECTIONS WILL THEY LOSE ONE SEAT AK

Telangana: టీఆర్ఎస్ ఆ MLC సీటు కోల్పోనుందా ? KCR మాటలకు అర్థమేంటి ?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

K Chandrashekar Rao: కేసీఆర్ నోటి వెంట ఏ మాట ఊరికే రాదని.. కాబట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.

  తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి. తాజాగా కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ, కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తాము గతంలో చూడలేదని.. భవిష్యత్తులో కూడా చూడకపోవచ్చని వ్యాఖ్యానించింది. కేంద్రం వరి కొనుగోళ్ల విషయంలో కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో.. యాసంగి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరపబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ రెండు మూడు సీట్లు గెలవగానే ఎగిరెగిరిపడుతోందని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు.

  గతంలో కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. ఇదే క్రమంలో కేసీఆర్ త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటికే తాము 13 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నామని.. ఒకవేళ ఓడిపోతే ఒకటి రెండు సీట్లు ఓడిపోవచ్చని.. దాన్ని తాము పెద్దగా పట్టించుకోబోమని కేసీఆర్ అన్నారు. అయితే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేశారా లేక కావాలనే చేశారా అనే చర్చ మొదలైంది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ రెబల్‌గా సర్ధార్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయనకు మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ఉంది.

  ఈ కారణంగానే ఆయన బరిలో ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు రవీందర్ సింగ్‌ను ఈటల బరిలోకి దింపారని.. ఆయనను గెలిపించుకునేందుకు పక్కా వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారని కరీంనగర్ జిల్లా రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవీందర్ సింగ్ గెలవొచ్చని టీఆర్ఎస్‌కు కూడా సమాచారం వచ్చిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో.. తమ స్థానిక నేతలను క్యాంపులకు తరలిస్తోంది.

  Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

  KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

  Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

  Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

  అయితే క్యాంపులకు వెళ్లిన నాయకుల్లో కొందరు రవీందర్ సింగ్‌కు ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ స్థానంలో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందనే చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని కరీంనగర్ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ కారణంగానే సీఎం కేసీఆర్ ఒకటి రెండు సీట్లలో తాము ఓడిపోతే ఓడిపోవచ్చని అన్నారా ? అనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ నోటి వెంట ఏ మాట ఊరికే రాదని.. కాబట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు