తెలంగాణ ఆర్టీసీ సమ్మె... చంద్రబాబు మౌనం

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు స్పందిస్తే... ఏపీ సర్కార్ ఈ అంశంలో ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 7, 2019, 6:05 PM IST
తెలంగాణ ఆర్టీసీ సమ్మె... చంద్రబాబు మౌనం
చంద్రబాబు, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు దాదాపుగా విపక్షాలన్నీ మద్దతు తెలిపాయి. సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని... వెంటనే సమ్మె ఆగేలా చర్యలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నేతలు మాత్రమే కాదు... ఏపీకి చెందిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఆర్టీసీ సమ్మెను సానుకూల వాతావరణంలో పరిష్కారం కనుగొనాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అయితే ఆర్టీసీ సమ్మెపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా స్పందించలేదు.

టీ టీడీపీ నేతలు తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలిపినా... మాజీ సీఎం చంద్రబాబు ఈ అంశంపై రియాక్ట్ కాకపోవడంపై టీడీపీతో పాటు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తున్న తరుణంలో... చంద్రబాబు కూడా ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తే బాగుంటుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే చంద్రబాబు మాత్రం ఈ అంశంపై సైలెంట్‌గా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై స్పందించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు స్పందిస్తే... ఏపీ సర్కార్ ఈ అంశంలో ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వారి వయోపరిమితిని రెండేళ్లు పెంచారు. దీంతో ఈ అంశంపై స్పందిస్తే... ఏపీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా స్పందించాల్సి వస్తుందనే కారణంగానే చంద్రబాబు దీనిపై మౌనంగా ఉన్నారనే ప్రచారం మొదలైంది.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading