టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు... కారణం అదే ?

కొన్ని నెలల క్రితం బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలిసిన షకీల్ తీరు టీఆర్ఎస్‌కు కొంత ఇబ్బంది కలిగించింది.

news18-telugu
Updated: December 9, 2019, 3:23 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు... కారణం అదే ?
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు కావడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆయన అనుచరులు ఇసుక మాముళ్ల కోసం తనపై దాడి చేశారంటూ ముగ్గురు వ్యక్తులు కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఆయన సోదరుడు సోహైల్, మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఇదే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంపై టీఆర్ఎస్ వర్గాలు పలురకాలుగా చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యే షకీల్ పై అధిష్ఠానం కొద్ది రోజులుగా గుర్రుగా ఉందని..ఈ కారణంగానే ఆయనపై కేసు నమోదై ఉండొచ్చనే ప్రచారం జోరందుకుంది.

కొన్ని నెలల క్రితం బీజేపీ ఎంపీ అరవింద్‌ను కలిసిన షకీల్ తీరు టీఆర్ఎస్‌కు కొంత ఇబ్బంది కలిగించింది. అప్పట్లో ఈ వ్యవహరం సద్దుమణిగినట్టు కనిపించినా... షకీల్ వ్యవహారంలో మాత్రం టీఆర్ఎస్ నాయకత్వం ఆగ్రహంగానే ఉన్నట్టు వార్తలు వినిపించాయి. దీనికి తోడు నియోజకవర్గంలో ఇసుక దందాలో ఎమ్మెల్యే అనుచరుల జోక్యం పెరిగిపోవడం కూడా అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఆయన సోదరుడు షాడో ఎమ్మెల్యేగా ప్రతీ పనిలో జోక్యం చేసుకోవడం, అధికారులను బెదిరించడం పట్ల అధిష్ఠానం సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. ఎమ్మెల్యేపై కేసు నమోదు వెనుక పార్టీ పెద్దల జోక్యం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.


First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>