ఏపీ శాసనమండలికి వెళ్లాలంటే జంకుతున్న మంత్రులు.. కారణమదేనా?

ఏపీ శాసనమండలిలో తమకు తగిన సంఖ్యాబలం లేదనో, లేదా అక్కడికి వెళితే టీడీపీ సభ్యులు ఇబ్బందిపెడతారని అనుకుంటున్నారో కానీ మండలికి వెళ్లేందుకు వైసీపీ మంత్రులు ఇష్టపడటం లేదు.. మొన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మినహా మండలిలో మంత్రులు కనిపించలేదు. దీంతో రాష్ట్రంలో పలు కీలక సమస్యలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరిని ప్రశ్నించాలో తెలియక సతమతం అవుతున్నారు. దీనిపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.

news18-telugu
Updated: July 17, 2019, 11:24 AM IST
ఏపీ శాసనమండలికి వెళ్లాలంటే జంకుతున్న మంత్రులు.. కారణమదేనా?
వైఎస్ జగన్ (File)
  • Share this:
(సయ్యద్ అహ్మద్,న్యూస్18 కరస్పాండెంట్, అమరావతి)

ఏపీ బడ్డెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అయితే ఇది శాసససభలో మాత్రమే. శాసనమండలిలో మాత్రం చర్చ నామమాత్రంగా సాగుతోంది. దీనికి కారణం మంత్రులు శాసనసమండలికి వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడమే. శాసన సభతో పాటు మండలిలోనూ బడ్జెట్ పై రోజువారీ సాధారణ చర్చ జరగాల్సి ఉంది. ఇందులో అధికార, విపక్ష పార్టీల సభ్యులు పాల్గొని బడ్జెట్ పై తమ అభిప్రాయాలు చెప్పడం సర్వసాధారణమే. బడ్జెట్ పై సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మంత్రులపైనా ఉంటుంది. గతంలో శాసనమండలిలో అజెండా ప్రకారం జరిగే చర్చల్లో మంత్రులు క్రియాశీలంగా పాలుపంచుకునేవారు. సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సావధానంగా సమాధానాలు కూడా చెప్పేవారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్ధితి కనిపించడం లేదు.

ఏపీ శాసనమండలిలో వైసీపీతో పోలిస్తే టీడీపీ సభ్యుల బలం పలురెట్లు ఎక్కువగా ఉంది.తొలిసారి అదికారంలోకి వచ్చిన వైసీపీ తరఫున సహజంగానే ఎక్కువ మంది సభ్యుల ప్రాతినిధ్యం లేదు. దీంతో టీడీపీ సభ్యుడే ఛైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో మంత్రులు మండలికి వస్తే టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే శాసనసభలో టీడీపీ సభ్యులు సంధిస్తున్న ప్రశ్నలకు కొందరు మంత్రుల వద్ద సమాధానాలు ఉండటం లేదు. అలాంటిది శాసనమండలికి వెళితే పరిస్ధితి ఎలా ఉంటుందో అన్న మీమాంస మంత్రుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శాసనసభలో అయితే తోటి వైసీపీ సభ్యుల బలం మంత్రులకు కలిసివస్తుంది. ఏదైనా అంశంపై కాస్త అటుఇటుగా మాట్లాడినా సమాధానాలు అందించేందుకు వైసీపీ సభ్యులు ఎక్కువమంది ఉంటారు. అదే మండలిలో అయితే అలాంటి పరిస్ధితి ఉండదు. నామమాత్రంగా ఉన్న వైసీపీ సభ్యుల నుంచి తగిన సహకారం లభించకపోతే మంత్రులు అభాసుపాలు కావాల్సి వస్తుంది. దీంతో మంత్రులు ఉద్దేశపూర్వకంగానే మండలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

శాసనసమండలికి మంత్రులు రాకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ పై తాము అడగాల్సిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. మండలికి మంత్రుల గైర్హాజరీపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్దమవుతున్నారు. మంత్రులను మండలికి రప్పించేలా రూలింగ్ ఇవ్వాలని ఛైర్మన్ ను వారు కోరనున్నారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com