REASON BEHIND AP CM CHANDRABABU NAIDU AND MINISTERS CHANGE THEIR ATTITUDE ON CS LV SUBRAMANYAM AND OTHER OFFICIALS AK
సీఎస్‌తో ఇబ్బంది లేదు... సమస్యంతా ఈసీతోనే... ఏపీ ప్రభుత్వం యూటర్న్
ఏపీ సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం(ఫైల్ ఫోటో)
కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించిన సోమిరెడ్డి... సమస్యంతా ఈసీతోనే అని కామెంట్ చేయడం విశేషం.
నిన్నమొన్నటి వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబునాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి. సీఎస్ సీఎం దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వరా ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలోనే ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఎలాంటి సమస్య లేదని ఏపీ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించిన సోమిరెడ్డి... సమస్యంతా ఈసీతోనే అని కామెంట్ చేయడం విశేషం. రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అందుకు కారణం అధికారుల కృషి అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చాలామంది ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏపీ కేబినెట్ ఈ రకమైన వైఖరి తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులపై మంత్రులు, టీడీపీ నేతలు నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం వర్సెస్ సీఎస్ వ్యవహారంలో సీఎస్‌కు అండగా ఉండాలని అనేకమంది ఐఏఎస్‌లు సమావేశమై నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి తోడు ఏపీ కేబినెట్ భేటీ జరిగేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహకరించినప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి కొద్దిరోజుల క్రితం వరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరు చెబితేనే అంతెత్తున్న లేచిన మంత్రులు... ఇప్పుడు ఆయనతో సమస్య లేదని చెప్పడం నిజంగా విశేషమే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.