అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలవకపోవడం వెనుక కారణం అదేనా ?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన అఖిలేష్ యాదవ్... ఈ అంశంపై ముందుగా మాయావతితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.

news18-telugu
Updated: December 27, 2018, 3:01 PM IST
అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలవకపోవడం వెనుక కారణం అదేనా ?
కేసీఆర్, అఖిలేష్ యాదవ్
  • Share this:
జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తున్న పార్టీలను ఈ కూటమిలోకి తీసుకురావాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. ఎన్డీయే, యూపీఏలకు సమాన దూరం పాటిస్తున్న బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో చర్చలు జరిపి వారిని ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు ఆయా పార్టీల నుంచి స్పందన రావడం లేదు.

Reason behind akilesh Yadav avoid meeting with Telangana CM KCR  అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలవకపోవడం వెనుక కారణం అదేనా ? ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన అఖిలేష్ యాదవ్... ఈ అంశంపై ముందుగా మాయావతితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.
కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమత బెనర్జీ

బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా... ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. నిజానికి కేసీఆర్‌తో సమావేశం కావడానికి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సిద్ధంగానే ఉన్నారని సమాచారం. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన అఖిలేష్ యాదవ్... ఈ అంశంపై ముందుగా మాయావతితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన కేసీఆర్‌తో భేటీని వాయిదా వేసుకున్నారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Reason behind akilesh Yadav avoid meeting with Telangana CM KCR  అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలవకపోవడం వెనుక కారణం అదేనా ? ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన అఖిలేష్ యాదవ్... ఈ అంశంపై ముందుగా మాయావతితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.
మాయావతి, అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫొటోలు)

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన బాగుందని కొనియాడిన అఖిలేష్... జనవరి మొదటి వారంలో ఆయనతో భేటీ అవుతానని ప్రకటించారు. దీంతో అప్పటిలోగా ఆయన ఈ అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చలు జరిపే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మాయావతి మనసులో ఏముందనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. మరోవైపు కేసీఆర్ కంటే ముందే కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాయావతితో కలిసి చర్చలు జరిపారు. దీంతో ఆమె చంద్రబాబు సూచనలను పరిగణనలోని తీసుకుంటారా లేక కేసీఆర్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Reason behind akilesh Yadav avoid meeting with Telangana CM KCR  అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలవకపోవడం వెనుక కారణం అదేనా ? ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన అఖిలేష్ యాదవ్... ఈ అంశంపై ముందుగా మాయావతితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.
బీఎస్పీ అధినేత్రి మాయావతి(ఫైల్ ఫోటో)

అయితే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపు తరువాతే జాతీయస్థాయిలో ఎవరితో కలిసి వెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని మాయావతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జనవరి మొదటివారంలో కేసీఆర్‌తో సమావేశమవుతానని ప్రకటించిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్... ఫెడరల్ ఫ్రంట్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
First published: December 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading