ఏపీలో మళ్లీ రీ పోలింగ్.. టీడీపీ కొంప ముంచుతుందా?

ఇటీవల ఏపీలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ జరగనుంది.

news18-telugu
Updated: May 15, 2019, 7:51 PM IST
ఏపీలో మళ్లీ రీ పోలింగ్.. టీడీపీ కొంప ముంచుతుందా?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 7:51 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారీ రీ పోలింగ్ జరగనుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో రీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించలేకపోయారని, వైసీపీ సానుభూతిపరులు పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా టీడీపీ అడ్డుకుందంటూ చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే, ఇక్కడ రీ పోలింగ్ నిర్వహిస్తే ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్ అవుతుందనే చర్చ మొదలైంది. చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పులవర్తి నాని పోటీ చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (File)


రీ పోలింగ్ జరిగే ఐదు పోలింగ్ కేంద్రాల్లో మూడు టీడీపీకి అనుకూలమైనవి అని తెలుస్తోంది. ఒకటి వైసీపీకి అనుకూలంగా ఉండే బూత్. ఐదోది మాత్రం రెండు పార్టీలకు సమాన దూరం పాటించే పోలింగ్ బూత్. కమ్మపల్లిలో రెండు బూత్‌లు, పులవర్తి పల్లి టీడీపీకి అనుకూలంగా ఉండేవని తెలుస్తోంది. కొత్త కండ్రిగ వైసీపీ వైపు మొగ్గుచూపే ప్రాంతం. ఇక వెంకటరామాపురం మాత్రం టీడీపీ, వైసీపీలకు సమానదూరం పాటించే ప్రాంతం. ఈ క్రమంలో రీపోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరికి మైనస్ అవుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. రీ పోలింగ్ తేదీ కూడా ఖరారు కావడంతో అప్పుడే గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు. ఇటీవల ఏపీలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ జరగనుంది.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...