చంద్రగిరిలో మరో రెండుచోట్ల రీపోలింగ్.. రేపే ఓటింగ్

310-కాలేపల్లి, 323-కుప్పం బాదురూలో ఆదివారం రీ-పోలింగ్‌కు ఆదేశాలిచ్చింది. మొదట ప్రకటించిన ఐదు పోలింగ్ స్టేషన్ల లీస్టులోకి మరో రెండు మొత్తం చంద్రగిరిలో ఏడు ప్రాంతంలో ఆదివారం రీ-పోలింగ్ జరగనుంది. 

news18-telugu
Updated: May 18, 2019, 2:03 PM IST
చంద్రగిరిలో మరో రెండుచోట్ల రీపోలింగ్.. రేపే ఓటింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రీపోలింగ్ జరగనుంది. ఆదివారం ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియెజకవర్గంలో మొత్తం ఏడు చోట్ల రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన పలుప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో పోలింగ్ బూత్ నెంబర్ 310, బూత్ నెంబర్ 323లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆ రెండు చోట్లా రీ పోలింగ్ నిర్వహించాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. దీనిపై నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం చంద్రగిరిలో మొత్తం ఏడు ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని ఆదేశించింది. ఇవాళ వైసీపీ నేతల బృందం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై చంద్రగిరి నియోజకవర్గంలో ఐదుచోట్లతో పాటు... మరో రెండు కేంద్రాల్లో రీ-పోలింగ్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

చంద్రగిరిలో మరో రెండుచోట్ల రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు


310-కాలేపల్లి, 323-కుప్పం బాదురూలో ఆదివారం రీ-పోలింగ్‌కు ఆదేశాలిచ్చింది. మొదట ప్రకటించిన ఐదు పోలింగ్ స్టేషన్ల లీస్టులోకి మరో రెండు మొత్తం చంద్రగిరిలో ఏడు ప్రాంతంలో ఆదివారం రీ-పోలింగ్ జరగనుంది. అంతకుముందు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్, రీపోలింగ్‌లో భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈసీని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రగిరిలో చంద్రబాబు ఎందుకు రీపోలింగ్ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదన్నారు.

శాంతియుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని కోరినట్లు పార్టీ నేతలు వివరించారు. మాక్‌ పోలింగ్‌లో పడిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు తొలగించని పక్షంలో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే అవకాశం ఉందని.. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెంట‌నే వెలువరించాలని వైసీపీ నేతలు ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బుట్టా రేణుక, రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ మొదలైన వారు ఉన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: May 18, 2019, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading