ఆరునెలల ముందే.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా

ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే విరల్ ఆచార్య తన రాజీనామాను సమర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: June 24, 2019, 10:02 AM IST
ఆరునెలల ముందే.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా
విరల్ ఆచార్య (ఏఎన్ఐ ట్విట్టర్)
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. పదవీ విరమణకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే... ఆయన తప్పుకోవడం కొత్త చర్చకు తెరలేపింది. మూడు సంవత్సరాల పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఉండేలా 2017, జనవరి 23న ఆయన్ను కేంద్రం నియమించింది. సరిగ్గా మరో ఆరు నెలలు టైం ఉందనగానే.. ఆయన పదవీ నుంచి వైదొలిగారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే విరల్ రాజీనామా చేస్తున్నానని తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆయన త్వరలోనే న్యూయార్క్ లోని స్టెర్న్ స్కూల్ లో ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారని సమాచారం.

జనవరి 23, 2017న విరాల్‌ ఆర్బీఐలో చేరారు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు తర్వాత ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్లలో అత్యంత చిన్న వయస్కుడు విరాల్‌ కావడం విశేషం. ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన గతంలో పనిచేసిన న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా వెళుతున్నట్లు సమాచారం. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని గట్టిగా వినిపించిన వ్యక్తి విరాల్‌ ఆచార్య.
First published: June 24, 2019, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading