జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై రాయపాటి వివరణ

కమ్మవాళ్ళు తలచుకుంటే సీఎం జగన్ లేచిపోతాడని తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని రాయపాటి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 16, 2020, 2:33 PM IST
జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై రాయపాటి వివరణ
రాయపాటి సాంబశివరావు (file)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు... తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ పై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ఆయన వివరించారు. కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని రాయపాటి వ్యాఖ్యానించారు. సీఎంగా జగన్ అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోవాలని మాత్రమే తాను చెప్పానని అన్నారు. కమ్మ వారిపై ద్వేషం మంచిది కాదని సీనియర్‌గా సలహా ఇచ్చానని రాయపాటి అన్నారు. తనకు సీఎం జగన్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని రాయపాటి తెలిపారు. జగన్ తండ్రి వైఎస్ తనకు మంచి సన్నిహితుడని వివరించారు.

వైసీపీ ప్రభుత్వంలో కమ్మ కులస్తులు పట్ల జరుగుతున్న వివక్షపైనే తాను మాట్లాడానని... కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను అనలేదని తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం తనను బాధించిందని వివరించారు. జగన్ మోహన్ రెడ్డి రెడ్డి పది కాలలపాటు సీఎంగా కొనసాగాలంటే అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. తాను అనని మాటలు అన్నట్లు ప్రచారం కావడంతో రాత్రి నుంచి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాయపాటి అన్నారు. సోషల్ మీడియాలో కూడా తనపై అసభ్యంగా వ్యాఖ్యలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

First published: April 16, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading