టీడీపీలో ఆ సీటు కోసం అప్పుడే మొదలైన పోటీ ?

టీడీపీలో సత్తెనపల్లి పంచాయతీలో ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సీటు కోసం అప్పుడే నేతల మధ్య పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: August 8, 2019, 4:12 PM IST
టీడీపీలో ఆ సీటు కోసం అప్పుడే మొదలైన పోటీ ?
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: August 8, 2019, 4:12 PM IST
ఎన్నికల సమయంలో నేతలు సీట్ల కోసం పోటీపడటం సర్వసాధారణం. అన్ని పార్టీల్లోనూ ఈ రకంగా జరుగుతుంటుంది. అయితే ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్లు ఉండగానే ఓ సీటు కోసం నేతలు పోటీ పడటం చాలా అరుదు. కానీ ఇలాంటి పరిస్థితే టీడీపీలో కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీటు కోసం టీడీపీలోని రెండు వర్గాలు మధ్య కొనసాగుతున్న పోటీ... ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. నిజానికి ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కోడెల కుటుంబసభ్యులు చేసిన వసూళ్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని మరో వర్గం ఆరోపిస్తోంది. అయితే తాజాగా మరో నాయకుడు రంగంలోకి దిగి కోడెలకు వ్యతిరేకంగా పావులు కదపడంతో... ఈ మొత్తం వ్యవహారం సీటు కోసం పోటీగా మారినట్టు కనిపిస్తోంది. సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఎన్నికలకు ముందు నుంచే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ప్రయత్నించారు. అయితే ఇది సాధ్యపడలేదు. చివరకు రాయపాటిని కన్విన్స్ చేసిన చంద్రబాబు... సత్తెనపల్లి నుంచి మళ్లీ కోడెల పోటీ చేసేలా చేశారు.

అయితే ఎన్నికల తరువాత మళ్లీ సత్తెనపల్లి టీడీపీలో కోడెలపై తిరుగుబాటు మొదలుకావడంతో... ఇదంతా ఆయనపై ఉన్న వ్యతిరేకతే అని అంతా భావించారు. కానీ తాజాగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే... సత్తెనపల్లి కోసం కోడెల వర్సెస్ రంగబాబు మధ్య పోటీ ఇప్పటి నుంచే మొదలైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలతో ఇప్పటికే కోడెల, రంగబాబు రహస్యంగా సమావేశాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సత్తెనపల్లి కోసం అప్పుడే టీడీపీలో పంచాయతీ మొదలైనట్టు కనిపిస్తోంది.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...