GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం

2019 ఎన్నికల్లో ఏపీలో ఒక ఊపు ఊపిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం ఇప్పుడు హైదరాబాద్‌లో వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 20, 2020, 9:55 PM IST
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం
ఏపీ సీఎం జగన్
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం జీహెచ్ఎంసీలో అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ, 2019 ఎన్నికల్లో ఏపీలో ఒక ఊపు ఊపిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ నినాదం ఇప్పుడు హైదరాబాద్‌లో వినిపిస్తోంది. అదేంటి, వైసీపీ పోటీ చేయకపోతే, జగన్ ఎందుకు రావాలని నినాదాలు చేస్తున్నారని మీకు డౌట్ వచ్చిందా? అయితే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. GHMC పరిధిలోని జగద్గిరి గుట్ట నియోజకవర్గం నుంచి కొలుకుల జగన్ అనే నాయకుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు కూడా జగన్ కాబట్టి, తన ఎన్నికల ప్రచార రథంపై ఇలా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని రాయించాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోను చూడగానే చాలా మంది ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరో వాడిన ఎన్నికల ప్రచార వాహనాన్ని హడావిడిగా తీసుకొచ్చి దానికి గులాబీ రంగు వేసి వాడుకుంటున్నారేమోనని, ఆ హడావిడిలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ స్టిక్కర్‌ను తొలగించడం మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత ‘ఓహో అదా..?’ అంటున్నారు.

రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి జగన్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభిృద్ధిపై ప్రగతి నివేదికను తెలంగాణ భవన్‌లో రిలీజ్ చేశారు. గత ఎన్నికల్లో సెంచరీ మిస్ అయిందని, ఒక్కబాల్ కొడితే సెంచరీ కొట్టేవారిమన్నారు. జాంబాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయామన్నారు. ఈసారి సెంచరీ కొట్టాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.  హైదరాబాద్ తెలంగాణ కు ఆర్థిక ఇంజిన్ లాంటిదని, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్నారు. హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఆరేళ్ల కాలంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందిని ఆ జాబితాలో చేర్చింది. స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చోటు లభించలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న కవితకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రేటర్‌లో పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థలు నామినేషన్ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితా సీఎంతో పాటు కేవలం మంత్రులకు మాత్రమే చోటు కల్పించడంతో.. ఆ జాబితాలో కవితకు చోటు దక్కలేదని పలువురు అంటున్నారు. ఇక, ఇద్దరు మహిళా మంత్రులు.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఉన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 20, 2020, 9:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading