• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • RAMGOPAL VARMAS HEROINE ISHA KOPPIKAR JOINS BJP AS HEAD OF WOMEN TRANSPORT WING MS

బీజేపీలో చేరిన రాంగోపాల్ వర్మ హీరోయిన్..

బీజేపీలో చేరిన రాంగోపాల్ వర్మ హీరోయిన్..

ఇషా కొప్పికర్ (Image: ANI/Twitter)

Isha Koppikar Joins BJP : మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాష్ ప్రియాంక గాంధీని ఉద్దేశించి.. బాలీవుడ్ నటీనటుల్లాగే ప్రియాంక గాంధీ కూడా 'చాక్లెట్ ఫేస్' అంటూ వ్యాఖ్యలు చేసిన మరునాడే ఇషా కొప్పికర్ బీజేపీలో చేరడం గమనార్హం.

  • Share this:
    బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆదివారం ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడమే ఆలస్యం.. బీజేపీ మహిళా ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి ఆమెను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. కాగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'కంపెనీ' సినిమా ద్వారా ఇషా కొప్పికర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీతో పాటు తమిళ, తెలుగు, మరాఠీ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటించారు.

    ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాష్ ప్రియాంక గాంధీని ఉద్దేశించి.. బాలీవుడ్ నటీనటుల్లాగే ప్రియాంక గాంధీ కూడా 'చాక్లెట్ ఫేస్' అంటూ వ్యాఖ్యలు చేసిన మరునాడే ఇషా కొప్పికర్ బీజేపీలో చేరడం గమనార్హం. కొన్ని రాజకీయ పార్టీలు కరీనా కపూర్, సల్మాన్ ఖాన్‌లను పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని.. అలాగే కాంగ్రెస్ కూడా ఇప్పుడు 'చాక్లెట్ ఫేస్' అయిన ప్రియాంకను పాలిటిక్స్‌ లోకి తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో సమర్థులైన నేతలు లేనందువల్లే ఇలాంటి చాక్లెట్ ఫేస్‌లను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు.




    ఇది కూడా చదవండి : హేమ మాలిని డ్యాన్సులు.. బీజేపీకి ఓట్లు.. ప్రియాంక లాంటి బ్యూటీ లేకపోవడం వాళ్ల దురదృష్టం : కాంగ్రెస్
    First published:

    అగ్ర కథనాలు