Home /News /politics /

RAMATHEERTHAM ISSUE TURNS INTO POLITICAL FIGHT IN ANDHRA PRADESH PRN

Andhra Pradesh: రామతీర్థంలో టెన్షన్.. టెన్షన్.. చంద్రబాబు కంటే ముందే విజయసాయి రెడ్డి టూర్

రామతీర్థంపై రాజకీయ దుమారం

రామతీర్థంపై రాజకీయ దుమారం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయనగరం జిల్లా (Vizianagaram District) రామతీర్థం ఆలయం (Ramatheertham Temple)పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఓ వైపు వైసీపీ (YSRCP), మరోవైపు టీడీపీ (TDP), ఇంకోవైపు బీజేపీ (BJP) నేతలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో.., ఆయన కంటే ముందే అక్కడికి వెళ్లేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు నాలుగు రోజులుగా బీజేపీ నేతలు రామతీర్థం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓ వైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇంకో వైపు బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోవడంతో రామతీర్థంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ కూడా రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    రామతీర్థం ఘటనపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆలయాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. చంద్రబాబు పర్యటనకు బయలుదేరే ముందే విజయసాయి రెడ్డి కూడా రామతీర్థం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు కూడా రామతీర్థం బాట పట్టారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలయాలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని మండిపడ్డారు.

    Attack on Kodanda Ramalayam in Ramathetham of Andhra Pradesh
    కొలనులో లభ్యమైన శ్రీరాముని విగ్రహం శిరస్సు భాగం


    మరోవైపు చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. విజయసాయి రెడ్డి ఆరోపణలపై స్పందించిన లోకేష్.., సీఎం జగన్ కు దమ్ముంటే సింహాచలం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అటు సీఎం జగన్ కూడా ఆలయాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దేవుడితో పెట్టుకుంటే శిక్షతప్పదని జగన్ అన్నారు.

    YCP MP Vijay Sai Reddy made sensational allegations on Chandra Babu Naidu and Lokesh
    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)


    శ్రీరాముడిపై దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దోషులను శిక్షించేవరకు రామతీర్థం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

    ఇక ఆలయంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులు ఇప్పటికే సూరిబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే విగ్రహ ధ్వంసం ఘటనతో సూరిబాబుకు ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో తీసుకెళ్లిన పోలీసులు సూరిబాబు ఎక్కడున్నారో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరిబాబు ఎలాంటి తప్పు చేయలేదని వెంటనే అతడ్ని విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Bjp, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు