డీకే అరుణ వెనుక కీలక నేత... చక్రం తిప్పుతున్నారా ?

డీకే అరుణకు ఈ విషయంలో బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన రామ్‌మాధవ్ నుంచి స్పష్టమైన హామీ లభించిందనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 10, 2019, 7:03 PM IST
డీకే అరుణ వెనుక కీలక నేత... చక్రం తిప్పుతున్నారా ?
డీకే అరుణ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ మరోసారి లక్ష్మణ్‌కు రావొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ పదవి ఈసారి తనదే అనే ధీమాలో మాజీమంత్రి డీకే అరుణ ఉన్నట్టు బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆమె ఈ మధ్యకాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌పై దూకుడుగా ముందుకు సాగుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై డీకే అరుణ ఈ స్థాయిలో ఆశలు పెట్టుకోవడానికి అసలు కారణం వేరే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

డీకే అరుణకు ఈ విషయంలో బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన రామ్‌మాధవ్ నుంచి స్పష్టమైన హామీ లభించిందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణ బీజేపీ వ్యవహారాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌మాధవ్... రాష్ట్ర కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తెలంగాణలో కేసీఆర్‌పై దూకుడుగా పోరాటం చేయాలంటే డీకే అరుణ వంటి నాయకులైతేనే బాగుంటుందని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.

bjp, telangana bjp, lok sabha elections 2019, lok sabha elections, ls polls, trs, congress, tdp, karimnagar, nizamabad, adilabad, secunderabad, bandi sanjay kumar, kishan reddy, aravind, kavita, k.kavita, vivek, v6 vivek, v6 news, Telangana Assembly elections, Bharatiya Janata Party, BJP, Ram Madhav, Telangana, Telangana Assembly Elections, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, తెలంగాణ, బీజేపీ, టీఆర్ఎస్, రాంమాధవ్, కేసీఆర్, కాంగ్రెస్, టీడీపీ, ram madhav, kcr,
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్(ఫైల్ ఫోటో)


డీకే అరుణ తెలంగాణ బీజేపీ చీఫ్ అయితే... తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై డీకే అరుణ అంతగా ఆశలు పెట్టుకోవడం వెనుక రామ్‌మాధవ్ ఉన్నారనే టాక్ బీజేపీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది.


First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>