చంద్రబాబు గారు ఆయన మిమ్మల్ని కలుస్తాడంట... వర్మ రిక్వెస్ట్

జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఓ ఫొటోను వర్మ మార్ఫింగ్ చేశాడు.

news18-telugu
Updated: December 9, 2019, 8:23 AM IST
చంద్రబాబు గారు ఆయన మిమ్మల్ని కలుస్తాడంట... వర్మ రిక్వెస్ట్
రాంగోపాల్ వర్మ, చంద్రబాబు
  • Share this:
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఈనెల 12న రిలీజ్ కానుండడంతో వర్మ మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాడు. ప్రముఖుల్ని టార్గటె్ చేస్తూ వర్మ రాజకీయాలు మొదలయ్యాయి. తాజాగా వర్మ చంద్రబాబును ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. వర్మ తాజా సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ చేసిన వ్యక్తిని చూస్తే అందరూ ఆశ్చర్య పోతారు. నిజంగా ఆయన చంద్రబాబులాగానే ఉన్నారని అంతా అనుకున్నారు. ఆ వ్యక్తి చంద్రబాబును కలవాలనుకుంటున్నారు... ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నారంటూ వర్మ మరో ట్వీట్ పెట్టాడు. ఇప్పటికే అధికారం కొల్పోయి... పార్టీ నేతల వలసలతో తలపట్టుకుంటున్న చంద్రబాబును వర్మ తన సినిమాలతో, ట్వీట్లతో మరింత రెచ్చగొడుతున్నారని రాజకీయ నేతలు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఓ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. వారిద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఆనందంలో ఉంటారు. వారి వెనుక టీవీ స్క్రీన్ మీద అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్నట్టు బ్రేకింగ్ ఉంది. ఈ ఫొటోను ట్వీట్ చేసిన వర్మ.. వారిద్దరూ తనకు తెలియదని, వారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో కూడా తెలియదని చెప్పాడు.First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>