RAM GOPAL VARMA SENSATIONAL TWEET ON TDP RAJYA SABHA MPS JUMP TO BJP TA
తెలుగు దేశం పార్టీ ఎంపీల జంపింగ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్..
రామ్ గోపాల్ వర్మ
ఎపుడు ఏదో ఒక వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ..తాజాగా నిన్న తెలుగు దేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో జాయిన్ కావడంపై తనదైన శైలిలో స్పందించారు.
ఎపుడు ఏదో ఒక వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ..తాజాగా నిన్న తెలుగు దేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో జాయిన్ కావడంపై తనదైన శైలిలో స్పందించారు. ఎలక్షన్స్‌కు కొన్ని రోజులు ముందు నుంచి టీడీపీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు ఎలక్షన్స్‌కు కొన్ని రోజులు ముందు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు. ఏపీలో ఈ సినిమా విడుదల కాకపోయినా.. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని ఓడించాలన్న రామ్ గోపాల్ వర్మ కసి మాత్రం తీరింది. తాజాగా తెలుగు దేశం పార్టికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే కదా. దీనిని ఉద్దేశిస్తూ.. అప్పట్లో ఎన్టీఆర్.. గుండెకు శస్త్ర చికిత్స కోసం అమెరికాకు వెళ్లినపుడు ఇక్కడ నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ప్రజా పోరాట ఫలితంగా తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే కదా.
History keeps on repeating itself ...The way Nadendla Bhasker Rao back stabbed NTR when he was abroad now the TDP leaders have backstabbed CBN when he is abroad
కట్ చేస్తే..ఇపుడు కూడా సేమ్ టూ సేమ్.. చంద్రబాబు నాయుడు విదేశాలకు విహార యాత్రకు వెళ్లినపుడు ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు.. పార్టీ అధినేతకు తెలియకుండా.. బీజేపీలోకి వెళ్లడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి రాజ్యసభ కలిసి రాలేదు. ఆ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్ప ఎవరూ పార్టీలో కొనసాగలేదు. అలాగే తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నేతలుగా పనిచేసిన వాళ్లెవరు ఆ పార్టీని ఒదిలి వెళ్లిపోయారు. సుజనా చౌదరీ పార్టీ మార్పుతో ఆ సంప్రదాయం కొనసాగించినట్టైంది.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి లేఖ అందజేసిన టీడీపీ ఎంపీలు (Image:ANI)
టీడీపీ రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన పి.ఉపేంద్ర,జయప్రద,వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్,యలమంచిలి శివాజీ,మోహన్ బాబు,తులసి రెడ్డి, మైసూరా రెడ్డి,రామముని రెడ్డి,సి.రామచంద్రయ్య, రేణుకా చౌదరి పార్టీని విడిచివెళ్లిపోయారు. తాజాగా సుజనా చౌదరి,సీఎం రమేష్,టీజీ వెంకటేశ్,గరికపాటి మోహన్ రావు అదే దారిలో పార్టీ మారారు. అటు పార్లమెంటరీ పార్టీ నేతలుగా పనిచేసిన పి.ఉపేంద్ర,దగ్గుబాటి వేంకటేశ్వరరావు,రేణుక చౌదరి,మందా జగన్నాథం,నామా నాగేశ్వరరావు వేరే పార్టీలోకి వెళ్లిపోవడం కొసమెరుపు. ఒక్క ఎర్రంనాయుడు మాత్రం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తాజాగా పార్లమెంటరీ నేతగా ఉన్న సుజనా చౌదరి పార్టీ మారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.