Home /News /politics /

RAM GOPAL VARMA LAKSHMIS NTR PRESS MEET IN VIJAYAWADA CANCELLED SB

విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ రద్దు... ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటూ ప్రశ్శించిన ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

. ప్రజాస్వామ్యం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు అంటూ ఆయనను ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

    విజయవాడలో రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ రద్దు అయ్యింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించల్సిన ఆయన ప్రెస్ మీట్‌ను రద్దు చేస్తున్నట్లు తాజగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోలీసులు తనను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ బెజవాడ ఎయిర్ పోర్టులో వదిలేశారన్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు అంటూ ఆయనను ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేశారు. నిజాన్ని ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నావంటూ ప్రశ్నించారు. విజజయవాడ వెళ్లిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎయిర్‌పోర్టును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం విజయవాడకు బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రెస్ మీట్‌కు పర్మిషన్ లేదన్నారు. వెంటనే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ ఆదేశించారు.

    వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



    First published:

    Tags: AP Politics, Chandrababu naidu, Lakshmis NTR, Laxmi's NTR, Ram Gopal Varma, Tollywood news, Twitter, Vijayawada

    తదుపరి వార్తలు