బస్తీమే సవాల్.. ఈసారి ఎవరు అడ్డొస్తారో చూస్తానంటున్న ఆర్జీవీ

‘ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము.’ అని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

news18-telugu
Updated: May 24, 2019, 10:33 PM IST
బస్తీమే సవాల్.. ఈసారి ఎవరు అడ్డొస్తారో చూస్తానంటున్న ఆర్జీవీ
కత్తితో రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ ఫోటో
  • Share this:
రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు. విజయవాడలో తాను మళ్లీ ప్రెస్ మీట్ పెడతానని.. ఈ సారి ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు. అయితే, అప్పుడు ఎన్నికల సమయం కావడం, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మళ్లీ హైదరాబాద్ వెనక్కి పంపేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హైడ్రామా జరిగింది. అయితే, ఇప్పుడు ఎవరు అడ్డొస్తారో చూస్తానంటూ ఆర్జీవీ సవాల్ విసురుతున్నారు. ఈనెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆయన విజయవా వెళ్ళనున్నారు. ‘ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!!’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

First published: May 24, 2019, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading