రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి షాక్... ఓటేయని ఇద్దరు ఎమ్మెల్యేలు...

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.

news18-telugu
Updated: June 19, 2020, 4:04 PM IST
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి షాక్... ఓటేయని ఇద్దరు ఎమ్మెల్యేలు...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. ఏపీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 175 ఎమ్మెల్యేల్లో 173 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన ఓటు వేశారు. ఇక టీడీపీకి ఉన్న 23 మందిలో 21 ఓట్లు పడ్డాయి. అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టై ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఓటు వేయలేదు. అలాగే, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు. అనగాని సత్యప్రసాద్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, తాను కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిశానని, ఆ తర్వాత ఆయనకు కరోనా రావడంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు. అందుకే ఓటు వేయలేకపోతున్నానంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. పార్టీకి కొన్ని రోజులుగా దూరంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఓటు వేసిన తర్వాత మద్దాలి గిరి చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని, ఇప్పుడు ఓడిపోతారని తెలిసి దళితుడికి సీటు ఇచ్చారని మండిపడ్డారు.
First published: June 19, 2020, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading