ఉగ్రవాదంపై కేంద్రం మరో పంజా.. రాజ్యసభలో పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు..

Rajya Sabha : దేశంలో ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. ఈ రోజు రాజ్యసభలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) సవరణ బిల్లు(యుఏపీఏ)ను పెద్దల సభలో నెగ్గించుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 5:52 PM IST
ఉగ్రవాదంపై కేంద్రం మరో పంజా.. రాజ్యసభలో పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు..
రాజ్యసభ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం మరో పంజా విసిరింది. దేశంలో ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. ఈ రోజు రాజ్యసభలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) సవరణ బిల్లు(యుఏపీఏ)ను పెద్దల సభలో నెగ్గించుకుంది. అంటే.. ఇప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్ర వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే, ఈ చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదించాయి. అలాంటిదేమీ ఉండదని, మానవ హక్కుల ఉల్లంఘన జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై వాడీవేడి చర్చ జరిగింది. అమిత్ షా, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. చట్టాలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలను అమిత్ షా దీటుగా తిప్పి కొట్టారు. 'ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగింది? మొత్తం మీడియాపై నిషేధం విధించారు. ప్రతిపక్ష నేతలు కనిపిస్తే చాలు జైళ్లలోకి తోసేశారు. దాదాపు 19 నెలల పాటు ప్రజాస్వామ్యం లేనేలేదు. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరా మమ్మల్ని విమర్శించేది? ఒకసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి' అని చురకలు అంటించారు.

అటు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక సంస్థపై నిషేధం విధిస్తే, ఆ వ్యక్తులే మరో సంస్థతో ముందుకు వస్తారని, ఇలా ఎంతకాలమని సంస్థలను నిషేధిస్తామని షా ప్రశ్నించారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడబోమని, అందుకే యూపీఏ సర్కారు 2004, 2008, 2013లో తీసుకువచ్చిన సవరణలకు బీజేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, మానవత్వానికి అది చెడు చేస్తుందని తాము బలంగా విశ్వసిస్తామన్నారు.

దీనిపై మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదంపై రాజీ పడిందని, రుబయ సయీద్, మసూద్ అజార్‌లను విడిచిపెట్టింది అప్పుడు అధికారంలో ఉన్న కాషాయ పార్టీయేనని అన్నారు. తాము ఉగ్రవాదంపై రాజీ పడలేదని, ఫలితంగా ఇందిర, రాజీవ్, బియాంత్ సింగ్‌ను కోల్పోయామని స్పష్టం చేశారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు