బీజేపీలో మౌనంగా ఏపీ ఎంపీ... అసలు కారణం ఇదే ?

బీజేపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాత్రం రాజకీయంగా సైలెంట్ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీలో చేరిన తరువాత ఆయన తన వాయిస్‌ను ఎక్కడా వినిపించడం లేదు.

news18-telugu
Updated: August 22, 2019, 4:36 PM IST
బీజేపీలో మౌనంగా ఏపీ ఎంపీ... అసలు కారణం ఇదే ?
బీజేపీ జెండా
news18-telugu
Updated: August 22, 2019, 4:36 PM IST
ఏపీకి చెందిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ కొద్ది వారాల క్రితం బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీలుగా మారిపోయారు. కేవలం పార్టీ మారడం మాత్రమే కాదు... ఇప్పుడు బీజేపీలో వీరి దూకుడు కూడా పెరిగింది. సీఎం రమేశ్, సుజనా చౌదరి ఏపీ బీజేపీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే... తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు గరికపాటి మోహన్ రావు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ముగ్గురి పరిస్థితి ఇలా ఉంటే... బీజేపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాత్రం రాజకీయంగా సైలెంట్ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీలో చేరిన తరువాత ఆయన తన వాయిస్‌ను ఎక్కడా వినిపించడం లేదు. మిగతా ముగ్గురు రోజూ ఏదో ఒక చోట సందడి చేస్తుంటే... తనదైన వ్యాఖ్యలతో రాజకీయాల్లో వేడి పుట్టించే టీజీ వెంకటేశ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అసలు టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరిన తరువాత ఎందుకు సైలెంట్ అయిపోయారనే అంశంపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tg venkatesh silent in bjp, bjp mp tg venkatesh, tdp ex mp tg venkatesh, rajya sabha, tg venkatesh joins bjp, kurnool tg venkatesh, tdp, ysrcp, bjp, ap cm ys jagan, chandrababu naidu, amit shah, ap news, ap politics, బీజేపీలో టీజీ వెంకటేశ్ మౌనం, బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్, కర్నూలు, టీడీపీ, వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు, అమిత్ షా, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
టీజీ వెంకటేష్


బీజేపీలో చేరడం టీజీకి అంతగా ఇష్టంలేదని... అందుకే ఆ పార్టీలో చేరినా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ తాను టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడని... కుమారుడి నిర్ణయం కారణంగానే బీజేపీలో ఆయన దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి బీజేపీలో చేరిన తన తోటి టీడీపీ నేతలంతా దూసుకుపోతుంటే... టీజీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...