RAJYA SABHA MEMBER D SRINIVAS EPISODE BECOME NEW HEADACHE FOR TPCC PRESIDENT REVANTH REDDY AK
Telangana Politics: రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన ఆ సీనియర్ నేత వ్యవహారం ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth Reddy: డీఎస్ కొడుకు బీజేపీలో ఉంటే.. ఆయన తన కుమారుడిని విమర్శించగలుగుతారా ?.. కుమారుడిని కాదని కాంగ్రెస్ అభ్యర్థి కోసం పని చేస్తారా ? అని కొందరు నేతలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పార్టీని బలోపేతం చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అధికార టీఆర్ఎస్తో పాటు తెలంగాణలో బలపడుతున్న బీజేపీని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై రేవంత్ రెడ్డి అండ్ టీమ్ కసరత్తు చేస్తోంది. అయితే ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే ముందుగా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. పార్టీలోకి కొత్తగా చేరికలను ప్రొత్సహించడంపై ఫోకస్ పెట్టారు. పార్టీలోని నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ వైపు చూసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్గా పని చేసి టీఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడు అయిన డి.శ్రీనివాస్ వ్యవహారం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్... ప్రస్తుతం టీఆర్ఎస్కు దూరంగా ఉన్నప్పటికీ.. ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే మరికొన్ని నెలల్లోనే ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగుస్తుండటంతో.. డీఎస్ పార్టీ మార్పు అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాజకీయాలు" width="1600" height="1600" class="size-full wp-image-1127946" /> డి.శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)
అన్నీ అనుకున్నట్టు జరిగితే కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్లో డీఎస్ చేరిక వాయిదా పడింది. అయితే డీఎస్ కాంగ్రెస్లో చేరడం వల్ల ఎలాంటి లాభం లేదని.. ఆయన పార్టీలోకి వస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని కొందరు నేతలు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుయాష్కీ గౌడ్, మాజీమంత్రి షబ్బీర్ అలీ సహా పలువురు నేతలు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
వీరంతా కలిసి రేవంత్ రెడ్డిపై ఈ అంశంలో ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. డీఎస్ కొడుకు బీజేపీలో ఉంటే.. ఆయన తన కుమారుడిని విమర్శించగలుగుతారా ?.. కుమారుడిని కాదని కాంగ్రెస్ అభ్యర్థి కోసం పని చేస్తారా ? అని కొందరు నేతలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే డీఎస్ నేరుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారని.. ఈ విషయంలో తన ప్రమేయం పెద్దగా లేదని ఆయన తనను కలుస్తున్న నేతలకు చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి డి.శ్రీనివాస్ వ్యవహారం.. రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారినట్టు ప్రచారం సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.