నరేంద్ర మోదీ 'డూప్' vs రాజ్‌నాథ్‌సింగ్..లక్నోలో ఆసక్తికర పోరు

గతంలో బీజేపీ మద్దతు పలికిన మోదీ డూప్..ఆ తర్వాత కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా లక్నో లోక్‌సభ బరిలోకి దిగుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.

news18-telugu
Updated: April 12, 2019, 7:30 PM IST
నరేంద్ర మోదీ 'డూప్' vs రాజ్‌నాథ్‌సింగ్..లక్నోలో ఆసక్తికర పోరు
అభినందన్ పాఠక్
news18-telugu
Updated: April 12, 2019, 7:30 PM IST
కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో‌లో ఆసక్తికర పోరు నెలకొంది. ఈ సారి రాజ్‌నాథ్ సింగ్‌పై 'నరేంద్ర మోదీ' పోటీచేస్తున్నారు. ఏంటి..రాజ్‌నాథ్‌పై ప్రధాని మోదీ పోటీచేస్తున్నారా? అని ఆశ్చర్య పోతున్నారా? అదేం లేదు. నరేంద్ర మోదీ పోలికలు కలిగిన వ్యక్తి రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నారు. అచ్చం మోదీలానే కనిపించే ఆయన దేశ ప్రజలకు సుపరిచతమే. గతంలో బీజేపీ మద్దతు పలికిన మోదీ డూప్..ఆ తర్వాత కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా లక్నో లోక్‌సభ బరిలోకి దిగుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.

మోదీ పోలికలతో ఉన్న ఈయన పేరు అభినందన్ పాఠఖ్. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ స్వస్థలం. గతంలో బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి మద్దతు పలికారు. మోదీని అనుకరిస్తూ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఐతే ఇచ్చిన హామీలను మోదీ చేయడం లేదంటూ గత ఏడాది కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం అక్టోబరులో RPI పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

''నేను ప్రధాని మోదీని పోలి ఉండడంతో ప్రజలంతా నన్ను అడిగే వాళ్లు. అచ్చే దిన్ (మంచి రోజులు) ఎప్పుడొస్తాయని ప్రశ్నించేవాళ్లు. సామాన్య ప్రజల కష్టాలను కళ్లారా చూసి నేను ఎంతో బాధపడ్డా. అందుకే బీజేపీ మిత్రపక్షాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరా.'' అని అభిందన్ చెప్పారు. గత ఏడాది కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా చెప్పిన మాటలివి..! అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు.

లక్నో బీజేపీకి కంచుకోట. 1991లో వాజ్‌పేయి గెలిచినప్పటి నుంచి గత ఎన్నికల వరకూ బీజేపీకే పట్టం గట్టారు ఓటర్లు. కాగా, కేంద్రహోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో ఏప్రిల్ 16న నామినేషన్ వేస్తారు. ఐదో విడతలో భాగంగా లక్నోలో మే 6న పోలింగ్ జరగనుంది.


First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...