news18-telugu
Updated: January 6, 2019, 8:27 PM IST
రాజ్‌నాథ్ సింగ్(File)
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తోంది. ఇటీవలి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు బెడిసికొట్టడంతో లోక్‌సభ ఎన్నికల కోసం జాగ్రత్తపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్నాథ్ సింగ్‌ను 'సంకల్ప్ పాత్ర' కమిటీ(మేనిఫెస్టో)కి చీఫ్‌గా నియమించారు.
ఈ కమిటీలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, రవి శంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా మరికొందరు సభ్యులుగా ఉండనున్నారు. ఎన్నికల కోసం మరో 17 కమిటీలను కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సోషల్&వలంటీర్ కమిటీకి చీఫ్‌గా నియమించారు. మరో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ బాధ్యతలను అప్పగించారు.
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్టీ మీడియా గ్రూప్ బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇంటలెక్చువల్ గ్రూప్స్‌ను ఆర్గనైజ్ చేసే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తోంది.
First published:
January 6, 2019, 8:25 PM IST