మోదీ అక్కడి నుంచే పోటీ చేస్తారు : క్లారిటీ ఇచ్చిన రాజ్‌నాథ్

PM Modi Will Again Contest From Varanasi : మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని.. తద్వారా బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది.గత ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 71 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఈసారి ఎస్పీ-బీఎస్పీ కలయిక గట్టి పోటీ ఇస్తుందన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: March 15, 2019, 9:59 PM IST
మోదీ అక్కడి నుంచే పోటీ చేస్తారు : క్లారిటీ ఇచ్చిన రాజ్‌నాథ్
నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: March 15, 2019, 9:59 PM IST
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై స్పందించారు. మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేస్తారని 'న్యూస్18'కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాను మరోసారి లక్నో నుంచే పోటీ చేస్తానని తెలిపారు. మోదీ ఒడిశాలోని పూరి లేదా మరోసారి గుజరాత్‌లోని వడోదరా నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ దీనిపై స్పందించారు.

మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని.. తద్వారా బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది.గత ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 71 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఈసారి ఎస్పీ-బీఎస్పీ కలయిక గట్టి పోటీ ఇస్తుందన్న వాదన వినిపిస్తోంది. కేంద్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలంటే యూపీలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం అనివార్యం కాబట్టి.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలంటే మోదీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.



First published: March 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...