ఐటీ సోదాల్లో రాజకీయ ప్రోద్భలం లేదు...రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ

ఎన్నికల వేళ విపక్ష నేతలు, వారి సన్నిహితులపై జరుగుతున్న ఐటీ, ఈడీ అధికారుల దాడుల వెనుక ప్రభుత్వ ప్రోద్భలం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు.

news18-telugu
Updated: April 9, 2019, 1:17 PM IST
ఐటీ సోదాల్లో రాజకీయ ప్రోద్భలం లేదు...రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ
రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
ఎన్నికల వేళ విపక్ష నేతలు, వారి సన్నిహితులపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడుల వెనుక రాజకీయ ప్రోద్భలం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు ప్రోద్భలంతోనే ఐటీ, ఈడీ అధికారులు విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ సోదాలు జరుపుతున్నారన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఐటీ, ఈడీ సంస్థలకున్న సమాచారం మేరకే ఆ సంస్థలు సోదాలు జరుపుతున్నాయని ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఐటీ, ఈడీ సంస్థలకు ఎన్నికల కోడ్ వర్తించదని గుర్తుచేసిన రాజ్‌నాథ్, సోదాలు నిర్వహించకుండా ఆ సంస్థలను ఎలా అడ్డుకోగలమని ప్రశ్నించారు.

బాలాకోట్‌లో వైమానిక దాడులపై...

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపే సమయంలో అమాయక పౌరులకు ఎలాంటి హాని జరగకుండా అత్యంత జాగ్రత్తవహించినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 26న తీవ్రవాద శిక్షణా శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపామని, అమాయక పౌరులకు హానితలపెట్టాలన్నది, పాక్‌ సైన్యంతో నేరుగా తలపడాలన్నది భారత ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్ దేశ సార్వభౌమత్వం, సమగ్రతపై దాడి చేయాలన్నది భారత ఉద్దేశం కాదని వ్యాఖ్యానించారు. భారత్ జరిపిన వైమానిక దాడులు అమాయక పౌరులు ఎవరూ మరణించలేదని చెప్పారు. పక్కా ఇంటెలిజన్స్ సమాచారంతోనే బాలాకోల్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపినట్లు వివరించారు.

పాక్‌తో శాంతి చర్చలపై...
పాకిస్థాన్‌కి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని భారత్ కూల్చేసిందని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. పెంటగాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు చెప్పుకొచ్చారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద చర్యలకు తన భూభాగాన్ని అనుమతించకుండా పాక్ పటిష్ట చర్యలు తీసుకుంటే, ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి చర్చలు, ఉగ్రవాదాన్ని ఒకేసారి ముందుకు తీసుకెళ్లడం కుదరదని వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో ప్రత్యేక ప్రధాని డిమాండ్‌పై...
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టంచేసిన రాజ్‌నాథ్ సింగ్... కశ్మీర్‌కి ప్రత్యేక ప్రధానిని నియమించాలన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న తమ ప్రతిపాదనపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమని, తాము చేయాల్సింది చేస్తామని వ్యాఖ్యానించారు.
First published: April 9, 2019, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading