HOME » NEWS » politics » RAJNATH SINGH FIRES MACHINE GUN FROM NAVYS AIRCRAFT CARRIER SB

మెషీన్‌ గన్‌ పట్టుకున్న రాజ్‌నాథ్ సింగ్... సముద్రంలో కాల్పులు

షిప్ డెక్ నుంచి కాలిబర్ మీడియం మెషీన్ గన్ నుంచి కాల్పులు జరిపారు. రెండు చేతులో గన్ పట్టుకుని సముద్రంలోకి కొన్ని రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు.

news18-telugu
Updated: September 30, 2019, 11:38 AM IST
మెషీన్‌ గన్‌ పట్టుకున్న రాజ్‌నాథ్ సింగ్... సముద్రంలో కాల్పులు
మెషీన్ గన్ ఆపరేట్ చేస్తున్న రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మిషన్ గన్ పట్టుకున్నారు.దేశ పశ్చిమ తీరంలో పయనిస్తున్న నౌకదళ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఆయన బస చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. షిప్ డెక్ నుంచి కాలిబర్ మీడియం మెషీన్ గన్ నుంచి కాల్పులు జరిపారు. రెండు చేతులో గన్ పట్టుకుని సముద్రంలోకి కొన్ని రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు.
ఆ సమయంలో కేంద్రమంత్రి పక్కనే ఉన్న సిబ్బంది ఆయనకు సూచనలు చేశారు.

ఆ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ సెయిలర్లతో మాట్లాడారు. ఫైరింగ్‌ను బాగా ఆస్వాదించినట్లు తెలిపారు. వాహక నౌక వద్ద పనిచేస్తున్న అధికారులు కుటుంబాలకు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సాగరంలో జలాంతర్గాములు, ఇతర యుద్ధనౌకలు చేసిన అనేక విన్యాసాలను వీక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాజ్‌నాథ్ సింగ్.

Published by: Sulthana Begum Shaik
First published: September 30, 2019, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading