Arun Jaitley: మంచి స్నేహితుడ్ని కోల్పోయా.. రాజ్‌నాథ్ సింగ్ ఆవేదన

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు.

news18-telugu
Updated: August 24, 2019, 2:35 PM IST
Arun Jaitley: మంచి స్నేహితుడ్ని కోల్పోయా.. రాజ్‌నాథ్ సింగ్ ఆవేదన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతిపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఓ మంచి స్నేహితుడ్ని కోల్పోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కోలిగ్‌ను కూడా కోల్పోయానంటూ ఆయన ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెషన్ పరంగా ఆయన ఓ లాయర్... ఫ్యాషన్ పరంగా ఆయన  ఓ పొలిటీషియన్ అంటూ... జైట్లీని కొనియాడారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు



First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు