దేశీ తేజస్ ఫైటర్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్..

rajnath singh becomes first defence minister to fly in home grown fighter tejas avr

మొదట 40 తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత వాయుసేన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.ఆ తర్వాత మరో 83 తేజస్ ఫైటర్స్‌ను సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

 • Share this:
  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్ నుంచి తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్దవిమానం తేజస్‌లో ప్రయాణించిన మొట్టమొదటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కావడం విశేషం.తేజస్ ఫైటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్,ఎయిర్ వైస్ మార్షల్ తివారీ కూడా రాజ్‌నాథ్‌తో పాటు ప్రయాణించారు.తేజాస్ ఫైటర్‌లో ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందని.. అద్భుతంగా ఉందని రాజ్‌నాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత వాయుసేనను తేజస్ మరింత పటిష్టం చేస్తుందని.. అనేక క్లిష్ట సందర్భాల్లో సమర్థవంతంగా తేజాస్ పనిచేయగలదని ధీమా వ్యక్తం చేశారు.

  మొదట 40 తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత వాయుసేన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.ఆ తర్వాత మరో 83 తేజస్ ఫైటర్స్‌ను సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వీటి విలువ సుమారు రూ.50వేల కోట్లు. తేజస్ ఫైటర్ తరహా యుద్ద నౌక ప్రస్తుతం తయారీదశలో ఉంది.
  ఇదిలా ఉంటే,గురువారం బెంగళూరులో నిర్వహించనున్న డిఫెన్స్ రీసెర్చ్&డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిషన్‌లో రాజ్‌నాథ్ పాల్గొననున్నారు.

  Published by:Srinivas Mittapalli
  First published: