హోమ్ /వార్తలు /రాజకీయం /

రజనీకాంత్ రాజకీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్?

రజనీకాంత్ రాజకీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్?

రజినీకాంత్ చేసిన పనికి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. తమ హీరో అంటే ఇదిరా అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు రజినీకాంత్. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

రజనీకాంత్ తన రాజకీయ పార్టీ పేరును ఇంకా ఖరారు కాలేదు. అయితే పార్టీని ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మాసంలో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రజనీ మక్కల్ మండ్రంకు చెందిన అగ్రనేతలు కన్ఫర్మ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో వారు తలమునకలైనట్లు తెలుస్తోంది. తన రాజకీయ పార్టీ పేరును రజనీకాంత్ ఇంకా ఖరారు చేయలేదు. ఏప్రిల్ 14 తర్వాత వెంటనే రజనీకాంత్ పార్టీ ఆవిర్భావం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో రజనీకాంతే నిర్ణయం తీసుకుంటారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2021 మే మాసం) జరగనున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కనీసం సంవత్సరం రోజులు కావాలని రజనీకాంత్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే తదితర చిన్నాచితక పార్టీలతో రజనీకాంత్ సన్నిహితులు ఇప్పటి నుంచే తెరచాటు సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. ఆ పార్టీలకు 5-10 శాతం ఓటు బ్యాంకు ఉంది.  ఆ పార్టీలతో చేతులు కలిపితే...వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని రజనీకాంత్ సన్నిహితులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

First published:

Tags: Rajnikanth, Tamilnadu

ఉత్తమ కథలు