అమిత్ షాకు షాక్ ఇచ్చిన రజినీ కాంత్

Rajinikanth | దేశంలో ఉమ్మడి భాష అనేది మంచిదే అయినా, దాన్ని బలవంతంగా రుద్దకూడదని రజినీకాంత్ అన్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 2:29 PM IST
అమిత్ షాకు షాక్ ఇచ్చిన రజినీ కాంత్
అమిత్ షా, రజినీకాంత్
  • Share this:
కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. ‘ఒకే దేశం ఒకే భాష’ అంటున్న నరేంద్ర మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. హిందీని ఉమ్మడి భాషగా చేయాలన్న అమిత్ షా ప్రతిపాదనను రజినీకాంత్ తప్పుపట్టారు. ‘దేశాన్ని ఐక్యం చేసేందుకు ఒకే భాష మంచిదే కావొచ్చు. కానీ, దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదు.’ అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఒప్పుకోవని స్పష్టంచేశారు. ‘హిందీని బలవంతంగా రుద్దకూడదు. కేవలం హిందీనే కాదు. ఏ భాషను కూడా ప్రజలపై బలవంతంగా రుద్దకూడదు. దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ ఉమ్మడి భాషను ఒప్పుకోవు. భారత్‌లో ఉమ్మడి భాష సాధ్యం కాదు.’ అని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. హిందీ దివస్ రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. హిందీ ఉమ్మడి భాషగా ఉండాలన్నారు.

హిందీని ఉమ్మడి భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యల మీద తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కమల్‌హాసన్ ఈ విషయం మీద ఘాటుగా స్పందించారు. ‘ఏ షా, సామ్రాట్, సుల్తాన్ కూడా దేశ ఐక్యతను దెబ్బతీయలేరు’ అని వ్యాఖ్యానించారు. దీని వల్ల చాలా మంది బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే దానిపై భారీ ఉద్యమం జరుగుతుందన్నారు. జల్లికట్టు అనేది కేవలం శాంపిల్ మాత్రమేనని, దానికంటే పెద్ద ఉద్యమం జరుగుతుందని కమల్ హాసన్ వార్నింగ్ ఇచ్చారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading