తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. చేతులు కలపనున్న కమల్,రజనీకాంత్

2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రజనీకాంత్ ర్టీ స్థాపించే అవకాశం ఉంది. అందుకే అటు సినిమాలు చేస్తూనే.. సందర్భానుసారం రాజకీయాలపై స్పందిస్తున్నారు.

news18-telugu
Updated: November 20, 2019, 8:02 AM IST
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. చేతులు కలపనున్న కమల్,రజనీకాంత్
కమల్ హాసన్,రజనీకాంత్ (File Photo)
  • Share this:
తమిళ ప్రజల కోసం అవసరమైతే కలిసి పనిచేయడానికి సిద్దమంటూ సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమ మనసులోని మాటను బయటపెట్టారు. తమిళ ప్రజల సంక్షేమం తామిద్దరం కలిసి పనిచేస్తామని.. విధానపరమైన నిర్ణయాలపై తర్వాత చర్చిస్తామని చెన్నై ఎయిర్‌పోర్టులో కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అయితే ఇందుకోసం భవిష్యత్‌లో రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా? అన్నదానిపై స్పష్టనివ్వలేదు.కమల్ వ్యాఖ్యల తర్వాత మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌కు ఇదే ప్రశ్నను సంధించారు. కమల్‌తో కలిసి పనిచేయబోతున్నారా? అని ప్రశ్నించగా.. తమిళ ప్రజల కోసం కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్దమని చెప్పారు.

రాజకీయాల్లో అద్భుతాలు,ఆశ్చర్యకర ఘటనలు సాధారణం.ఎడప్పాడి పళనిస్వామి సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా?. ఆయన సీఎం అయ్యాక ప్రభుత్వం నెల రోజుల్లో కూలిపోతుందని చాలామంది అనుకున్నారు.ఇంకొంతమంది ఐదు నెలల కంటే ఎక్కువ ఉండదన్నారు. కానీ రెండేళ్లకు పైబడి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు.

కాబట్టి రాజకీయాల్లో అద్భుతాలు ఇంతకుముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతున్నాయి.. ఇకముందు కూడా జరగబోతాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్


కాగా,కమల్ హాసన్ కంటే ముందు నుంచి రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీకాంత్.. ఇంతరవకు పార్టీ ప్రకటన చేయలేదు. గత మూడు,నాలుగేళ్లుగా రేపు.. మాపు.. అంటూ ఆయన పార్టీపై చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో ఆయన కాషాయానికి దగ్గరవుతున్నారన్న కథనాలు కూడా వినిపించాయి. అయితే కాషాయానికి తాను చిక్కను అని ఇటీవలే ఆ ప్రచారాల్ని పటాపంచలు చేసేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన పార్టీ స్థాపించే అవకాశం ఉంది. అందుకే అటు సినిమాలు చేస్తూనే.. సందర్భానుసారం రాజకీయాలపై స్పందిస్తున్నారు.

Published by: Srinivas Mittapalli
First published: November 20, 2019, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading