Rajasthan Political Crisis: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సచిన్ పైలట్

Rajasthan political crisis | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ తదుపరి రాజకీయ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటోంది. ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుండగా...మరికొందరు ఆయన సొంత పార్టీ పెట్టుకోవచ్చని చెబుతున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 10:11 AM IST
Rajasthan Political Crisis: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సచిన్ పైలట్
సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)
  • Share this:
Rajasthan Political News Updates | రాజస్థాన్ రాజకీయాలు రసకందాయంలోకి చేరాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు...ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం తప్పించడం తెలిసిందే. సచిన్ పైలట్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాపై కూడా వేటువేశారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణపై సచిన్ పైలట్ కాస్త క్లారిటీ ఇచ్చారు. తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ స్పష్టంచేశారు.

అటుక సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు నేపథ్యంలో అశోక్ గెహ్లోత్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ముందుగా తన బలాన్ని నిరూపించుకున్న తర్వాతే కేబినెట్‌ విస్తరన చేపట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె సమావేశంకానున్నారు.

ashok gehlot, rajasthan chief minister ashok gehlot, rajasthan news, అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ (News18 Creative)


సచిన్ పైలట్ స్థానంలో ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాశ్రను రాజస్థాన్ పీసీసీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. మొత్తం 200 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీలో తమకు పూర్తి మెజార్టీ ఉందని అశోక్ గెహ్లోత్ వర్గం ధీమా వ్యక్తంచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదంటున్నారు. అసెంబ్లీలో సచిన్ పైలట్‌కు 30 మంది ఎమ్మెల్యేల మద్ధతున్నట్లు ఆయన వర్గం చెబుతుండగా...అంత లేదని గెహ్లోత్ వర్గం ధీమాగా ఉంది.

మరోవైపు సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు అభిమన్యు పూనియా నేతృత్వంలో దాదాపు 500 మంది ఎన్ఎస్‌యూఐ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. పైలట్ సొంత నియోజకవర్గమైన తోంక్‌లోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన శరద్ పవార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్‌లానే సచిన్ పైలట్ కూడా కొత్త పార్టీ పెట్టాలని ఆయన మద్ధతుదారులు కోరుతున్నారు.
Published by: Janardhan V
First published: July 15, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading