Home /News /politics /

RAJASTHAN POLITICAL CRISIS LIVE UPDATES RELIEF FOR SACHIN PILOT AS HIGH COURT SAYS NO ACTION AGAINST REBEL MLAS TILL FRIDAY SK

Rajasthan Crisis: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్‌కు ఊరట

సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)

సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)

Rajasthan Crisis: సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశముంది.

    రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో హైడ్రామా కొనసాగుతోంది. రోజు మలుపుతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ సీఎం అశోక్ గహ్లోత్‌కు ఎదురుతిరిగిన సచిన్ పైలట్ వర్గానికి హైకోర్టులో ఊరట లభించింది. జూలై 24 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశముంది.

    సీఎల్పీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటువేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. ఈ క్రమంలో సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఆయన నోటీసులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. జూలై 24 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

    కాగా, రాజస్థాన్ రాజకీయాల్లో ఆడియో టేపులు ఇటీవల సంచలనం రేపాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఫోన్‌లో మాట్లాడి.. బేరసారాలకు దిగారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. వాటిపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన SOG.. ఎఫ్ఐఆర్‌లో భన్వర్ లాల్, సంజయ్ జైన్‌తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ పేర్లను పొందుపరించింది. అటు బీజేపీ నేతలతో బేరసారాలు జరిపిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ఈ పరిణామాలతో రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ashok Gehlet, Bjp, Congress, Rajasthan, Sachin Pilot

    తదుపరి వార్తలు