Home /News /politics /

RAJASTHAN POLITICAL CRISIS LIVE UPDATES NAMED IN FIR FOR TRYING TO TOPPLE GEHLOT GOVT UNION MINISTER SHEKHAWAT DENIES INVOLVEMENT SAYS READY FOR ANY PROBE SK

రాజస్థాన్‌లో రాజకీయాల్లో సంచలన మలుపు.. కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్

గజేంద్ర సింగ్ షెకావత్ (ఫైల్ ఫోటో)

గజేంద్ర సింగ్ షెకావత్ (ఫైల్ ఫోటో)

వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని తేల్చిచెప్పారు.

    రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం సంచలన మలుపు తిరిగింది. ఇటీవల బయపటడ్డ ఆడియో టేపులపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఫోన్‌లో మాట్లాడి.. బేరసారాలకు దిగారని తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పారు. వాటిపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన SOG.. ఎఫ్ఐఆర్‌లో భన్వర్ లాల్, సంజయ్ జైన్‌తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ పేర్లను పొందుపరించింది.

    మహేష్ జోషి నుంచి మాకు రెండు ఫిర్యాదులు అందాయి. నిన్న వైరల్ అయిన ఆడియో టేపుపై ఆయన ఫిర్యాదు చేశారు. సెక్షన్ 124a, 120b కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఆ ఆడియో టేప్ వాస్తవికత గురించి దర్యాప్తు చేయాల్సి ఉంది.
    అశోక్ రాథోడ్, ఏడీజీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్


    ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ స్పందించారు. వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని తేల్చిచెప్పారు.

    కాగా, శుక్రవారం ఇద్దరు పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రాథమిక సభ్యత్వం రద్దుచేశారు. తమ ఎమ్మెల్యేలతో సాక్షాత్తు కేంద్రమంత్రే బేరసారాలు చేశారన్న కాంగ్రెస్.. సచిన్ పైలట్ కూడా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్‌కు అందజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై ఆయన ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    అటు సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఆయన నోటీసులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. ఆ కేసుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Congress, Rajasthan, Sachin Pilot

    తదుపరి వార్తలు