• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • RAJASTHAN GOVERNMENT GOES AHEAD WITH CONSTRUCTION OF LUXURIOUS MLA FLATS WHILE CONGRESS OPPOSE TO CENTRAL VISTA PROJECT SU

ఆ విషయంలో మోదీపై విమర్శలు.. రాజస్తాన్‌లో మాత్రం ఎమ్మెల్యేలకు విలాసవంతమైన ఫ్లాట్స్ నిర్మాణం.. హాట్ టాపిక్‌గా కాంగ్రెస్ వైఖరి..

ప్రతీకాత్మక చిత్రం (Image-ANI)

రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యేలకు విలాసవంతమైన ఫ్లాట్స్‌ నిర్మాణ పనులను కొనసాగించడం హాట్ టాపిక్‌గా మారింది. సెంట్రల్ విస్టాకు సంబంధించి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. రాజస్తాన్‌లో రూ. 266 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతోంది.

 • Share this:
  రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓ ప్రాజెక్ట్ విమర్శలకు తావిచ్చేదిగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలకు విలాసవంతమైన ఫ్లాట్స్‌ నిర్మాణంపై రాజస్తాన్ ప్రభుత్వం ముందుకు సాగడమే ఇందుకు కారణం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను.. శుద్ధ దండగ అని వ్యాఖ్యానించారు. కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కొనసాగించడం సరైనది కాదంటూ కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మోదీకి, బీజేపీ నేతలకు ప్రజల అవస్థలు పట్టవంటూ మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలనే ఆలోచన పక్కన బెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  ఇలా కేంద్రంలోని మోదీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్.. తాము అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎమ్మెల్యే కోసం 160 విలాసవంతమైన ఫ్లాట్స్ నిర్మాణ చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే మే 20వ తేదీన ఇందుకు సంబంధించి నిర్మాణ పనులను ప్రారంభించారు. రాజస్తాన్ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీకి సమీపంలో ఈ ఫ్లాట్స్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. ఒక్కో ఫ్లాట్ 3,200 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో నిర్మించనున్నారు. ప్రతి ఫ్లాట్‌లో నాలుగు బెడ్ రూమ్స్‌ ఉండేలా ప్లాన్ చేసినట్టు రాజస్తాన్ హౌసింగ్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

  రూ. 266 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టాలని అంచనా వేశారు. తొలుత 176 ఫ్లాట్స్ నిర్మించాలని జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రపోజల్ సమర్పించినప్పటికీ.. రాజస్తాన్ హౌసింగ్ బోర్డు మాత్రం 160 ఫ్లాట్స్‌కు మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఇక, 30 నెలల్లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. అయితే అనుకున్న సమయాని కంటే ముందుగానే పనులు పూర్తి అవుతాయని రాజస్తాన్ హౌసింగ్ బోర్డు అంచనా వేస్తోంది. ఇక, ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు చట్టప్రకారమే చేపడుతున్నామని అన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: