అప్పుడు జ్యోతిరాదిత్య సింథియా..ఇప్పుడు సచిన్ పైలట్.. బీజేపీతో టచ్‌లో..

Rajasthan crisis updates | జ్యోతిరాదిత్య సింథియా గతంలో ఎంచుకున్న మార్గంలోనే...ఇప్పుడు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేగనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశముంది.

news18-telugu
Updated: July 12, 2020, 5:17 PM IST
అప్పుడు జ్యోతిరాదిత్య సింథియా..ఇప్పుడు సచిన్ పైలట్.. బీజేపీతో టచ్‌లో..
రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ ప్రమాణస్వీకారం (file)
  • Share this:
రాజస్థాన్‌ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం తారస్థాయికి చేరింది. మొదటి నుంచీ ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. అశోక్ గెహ్లాట్ వర్గం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్...బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మాజీ కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింథియా బాటలోనే సచిన్ పైలట్ కూడా త్వరలోనే బీజేపీ గూటికి చేరిపోవచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సచిన్ పైలట్ బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ఇప్పటికే సచిన్ పైలట్ తన మద్దతుదారులైన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 19 మంది ఎమ్మెల్యేల మద్దతు సచిన్ పైలట్‌గా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో జ్యోతిరాదిత్య సింథియాతో సచిన్ పైలట్ భేటీ కావడంతో...ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది.

rajasthan crisis updates, rajasthancrisis news, rajasthan latest news, sachin pilot bjp, రాజస్థాన్ సంక్షోభం, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ మద్దతు ఎమ్మెల్యేలు, అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్


కొన్ని మాసాల క్రితం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. కమల్‌నాథ్‌తో పొసగకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన జ్యోతిరాదిత్య సింథియా తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. జ్యోతిరాదిత్య సింథియా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి...బీజేపీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు పునరావృతంకానుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జ్యోతిరాదిత్య సింథియా గతంలో ఎంచుకున్న మార్గంలోనే...సచిన్ పైలట్ కూడా కమలం గూటికి చేరితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశముంది.

ashok gehlot, rajasthan chief minister ashok gehlot, rajasthan news, అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ (News18 Creative)


అటు రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ్లాగ్ వర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై చర్చించారు అశోక్ గెహ్లాట్. ఇవాళ రాత్రి తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో జైపూర్‌లో ఆయన ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. తన బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: July 12, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading