మౌనం వీడిన సచిన్ పైలట్.. పదవుల నుంచి తప్పించడంపై ట్వీట్

సచిన్ పైలట్‌ను పదవుల నుంచి తప్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సచిన్ పైలట్ 6 నెలలుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

news18-telugu
Updated: July 14, 2020, 3:19 PM IST
మౌనం వీడిన సచిన్ పైలట్.. పదవుల నుంచి తప్పించడంపై ట్వీట్
సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)
  • Share this:
రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌‌పై కాంగ్రెస్ హైకమాండ్ వేటువేసింది. పీసీసీ చీఫ్ పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పించింది. నేటి సీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా మరో ఛాన్స్ ఇచ్చినప్పటికీ.. సచిన్ వర్గం నేతలెవరూ హాజరుకాలేదు. ఈ క్రమంలోనే సచిన్‌తో పాటు ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై సచిన్ పైలట్ ట్విటర్ వేదికగా స్పందించారు. సత్యానికి ఇబ్బందులు కలిగిస్తారేమో గానీ.. సత్యాన్ని ఓడించలేరని ట్వీట్ చేశారు.


ఇక ట్విటర్ ఖాతాలో తన బయోడేటాను అప్‌డేట్ చేశారు సచిన్ పైలట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదాలను తొలగించి.. టోంక్ ఎమ్మెల్యే అని మాత్రమే పేర్కొన్నారు.


సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాను సైతం కేబినెట్ నుంచి తప్పించారు. ఈ మేరకు సీఎం అశోక్ గహ్లతో.. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసి ప్రతిపాదించారు. దానికి గవర్నర్ ఆమోద ముద్రవేశారు. కేబినెట్‌లో మూడు పదవులు ఖాళీ అయిన నేపథ్యంలో.. బుధవారం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు సీఎం అశోక్ గహ్లోత్. కొత్తగా ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.

సచిన్ పైలట్‌ను పదవుల నుంచి తప్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సచిన్ పైలట్ 6 నెలలుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని విమర్శలు గుప్పించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 14, 2020, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading