Home /News /politics /

Rajasthan crisis: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు.. బీజేపీపై సంచలన ఆరోపణలు

Rajasthan crisis: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు.. బీజేపీపై సంచలన ఆరోపణలు

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై SOG ఎఫ్ఐరఆర్ నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్, బీజేపీ నేత సంజయ్ జైన్‌పైనా కేసులు పెట్టాలని.. అంత భారీ మొత్తంలో నల్ల ధనాన్ని ఎవరు సమకూర్చారో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు పంపిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు సూర్జేవాల. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, బీజేపీ నేత సంజయ్ జైన్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేప్‌ను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయని ఆయన తెలిపారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు బేరసారాలకు దిగారని ఆరోపించారు. అందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పేందుకు ముందుకొచ్చారని విమర్శలు గుప్పించారు రణ్‌దీప్ సూర్జేవాలా.


    రెబల్ ఎమ్మెల్యేల జాబితాను సచిన్ పైలట్ బీజేపీకి అందజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై ప్రజల ముందుకొచ్చి ఆయన మాట్లాడాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై SOG ఎఫ్ఐరఆర్ నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్, బీజేపీ నేత సంజయ్ జైన్‌పైనా కేసులు పెట్టాలని.. అంత భారీ మొత్తంలో నల్ల ధనాన్ని ఎవరు సమకూర్చారో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



    సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఆయన నోటీసులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. ఆ కేసుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Rajasthan, Sachin Pilot

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు